Wednesday, September 3, 2025

‘సువర్ణ మాయ’ ఏం చేస్తుంది.. ‘కిష్కిందపురి’ ట్రైలర్ చూసేయండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఏడాది ‘భైరవం’ సినిమాతో సక్సెస్‌ని అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ వచ్చిన అప్‌డేట్స్ అన్ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. దెయ్యాల గురించి తెలుసుకోవాలని అనుకొనే వాళ్లు ఒక భవంతిలోకి వెళ్తే.. అక్కడ వాళ్లకు ఎదురయ్యే పరిస్థితులు ఏంటనేదే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతోంది.

ఇక ట్రైలర్‌లోని విజువల్స్, హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చివర్లో హీరోయిన్ అనుపమను దెయ్యంగా చూపించడం.. ఆ దెయ్యాన్ని ఎదురుకొనే శక్తి ఉన్న వ్యక్తిగా హీరోని చూపించడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఇక ఈ సినిమాలో (Kishkindhapuri) హైపర్ ఆది, సుదర్శన్ వంటి నటులతో కామెడీ కూడా పండించారు. ఇక ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. సాహు గారపాటి నిర్మించారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది.

Also Read : అలా ఎందుకు చేస్తారని బాధపడుతుంటా:కృతి సనన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News