టీమిండియా టెయిలెండర్స్ విఫలమవ్వడంతోనే తాము గెలిచామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరుగిన తొలి టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గెలపుపై బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ‘టీమిండియా, ఇంగ్లాండ్ రెండు జట్లూ నాణ్యమైన క్రికెట్ ఆడాయి. హెడింగ్లీ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలించింది. మా బౌలర్లు భారత టెయిలెండర్స్‌ను కట్టడి చేయడం వల్లే మేం ఈ మ్యాచ్‌లో విజయం సాధించగలిగాం. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేం ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించాం. పూర్తి ఓవర్లు బ్యాటింగ్ చేస్తే చాలు.. మేం గెలుస్తాం అనుకున్నాం’ అని బెన్‌స్టోక్స్ పేర్కొన్నాడు.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జైస్వాల్, గిల్, పంత్ లు శతకాలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 465కు పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో పంత్, కెఎల్ రాహుల్ లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ 364 పరుగులు చేసింది. అనంతరం 371 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ 82 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుది.