Sunday, July 27, 2025

IND vs ENG: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్..

- Advertisement -
- Advertisement -

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ఐదు టెస్టు మ్యాచ్ ల సందర్భంగా మాంచెస్టర్ వేదికగా భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో స్టోక్స్.. బౌలింగ్ వేసి ఐదు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్ లో శతకంతో చెలరేగాడు. దీంతో 42 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టడమే కాక, సెంచరీ చేసిన తొలి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా స్టోక్స్ రికార్డు నెలకొల్పాడు. అలాగే, ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేసి ఐదు వికెట్లు తీసిన నాల్గవ ఆల్ రౌండర్ గా నిలిచాడు. అతని కంటే ముందు ఇంగ్లాండ్ ప్లేయర్లు టోనీ గ్రెగ్, ఇయాన్ బోథమ్, గస్ అట్కిన్సన్ ఈ ఘనత సాధించారు. వీరిలో బోథమ్ ఏకంగా ఐదుసార్లు ఈ ఘనతను సాధించాడు.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 669 పరుగుల భారీ స్కోరు సాధించి.. 311 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. జో రూట్(150), బెన్ స్టోక్స్(141) భారీ శతకాలతో విజృంభించారు. వీరితోపాటు ఓపెనర్లు జాక్ క్రాలీ(84), డకెట్(94), పోప్(71)లు అర్థ సెంచరీలతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 669 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 310 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ తొలి ఓవర్ లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0), సాయి సుదర్శన్(0)లను ఔట్ చేసి భారత్ ను దెబ్బ కొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్ తో కలిసి మరో వికెట్ పడకుండా కెఎల్ రాహుల్(38) జాగ్రత్తగా ఆడుతున్నాడు. గిల్(56) మాత్రం కొంచెం దూకుడుగా ఆడుతూ అర్ధ సెంచరీ బాదాడు. దీంతో భారత్ స్కోరు 100 పరుగులు దాటింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News