హైదరాబాద్: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్కూల్ టీచర్‌తో ఏడేళ్లు డేటింగ్ చేసిన అనంతరం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2010లో క్లైర్ రాటి క్లిప్ అనే యువతి బెన్‌స్టోక్స్‌కు పరిచయమైంది. అప్పటికి బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టులో లేడు. మూడు సంవత్సరాలు సహజీవనం చేసిన అనంతరం క్లైర్‌కు స్టోక్స్ తన ప్రేమను వ్యక్తం చేశాడు. దేశీయ క్రికెట్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 2011లో ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకొని కొన్నేళ్లు జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. 2017లో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు స్టోక్స్, క్లైర్ అనే పిల్లలు ఉన్నారు. బెన్‌కు వెన్నంటి ఉండి అతడిని ఆమె నడిపించేది.
2017లో బ్రిస్టల్‌లో జరిగిన ఓ సంఘటనలో స్టోక్స్ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్లైర్ అతడిని విడిచిపెట్టకుండా మానసికంగా కుంగిపోకుండా బలంగా తయారు చేసింది. మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి కెప్టెన్‌గా మారాడు. భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. నాలుగో టెస్టు మ్యాచ్ లో కుడి భుజానికి దెబ్బతగలడంతో ఐదో టెస్టు మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. అతడి స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో ఇంగ్లాండ్ జట్టు 51.2 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. టీమిండియా రెండో ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసి సమయానికి 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.