Saturday, July 12, 2025

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే..?

- Advertisement -
- Advertisement -

కరివేపాకు అనేది భారతీయ వంటలలో ఉపయోగించే ఓ ఆరోగ్యకరమైన మూలిక. ఇది వంటలకు రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి తగిన పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే, ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కరివేపాకులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునేవారికి చాలా ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా ఆహారం తినకుండా ఉంటాం. కరివేపాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఈ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా దీనివల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అపచయం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

కరివేపాకు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఇది మధుమేహం ఉన్న వారికి చాలా లాభదాయకం. కరివేపాకాలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి, వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News