మామిడి పండును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. దీనిని కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని కూడా అంటారు. మామిడిపండు రుచితో పాటు, అనేక పోషకాలు నిండి ఉంటాయి. ఎండాకాలంలో మామిడి పండ్లు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తాయి. అయితే మామిడికాయ, పండు మాత్రమే కాదు దాన్ని పూత కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని మీకు తెలుసా..? మామిడిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని వీటిని అనేక రకాల ఔషధాలకు ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మామిడి పూతతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
మామిడి పూతలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి. అందువల్ల మామిడి పూత డయాబెటిస్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఇందులో ఉండే శోధన నిరోధక, యాంటీ మైక్రో బయల్ లక్షణాలు మొటిమల వంటి చర్మ సమస్యల నుండి కాపాడుతాయి. అంతేకాకుండా చర్మకాంతిని కూడా పెంచుతాయి.
మామిడి పూత లో ఉండే అనేక పోషకాలు అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ నాకు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ పూత రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీంతో అనేక రకాల ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు.