- Advertisement -
భార్య ముక్కు చాలా అందంగా ఉందని పొగిడిన భర్త.. దాన్ని కొరుక్కు తిన్నాడు. ఈ వింత ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో చోటుచేసుకుంది. శాంతీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారాలో భర్త బాపన్ షేక్ తో కలిసి మధు ఖాతూన్ అనే మహిళ నివసిస్తోంది. అయితే, ఇటీవల వీరి నివాసంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. తన ముక్కును భర్త బాపన్ షేక్ కొరిక్కేశాడంటూ.. అరుపులు, కేకలతో మధు ఖాతూర్.. ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ ఘటనపై ఆమె శాంతీపుర్ పోలీసులను ఆశ్రయించింది. “నీ ముక్కు అందంగా ఉంది.. అవకాశం దొరికితే కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పని చేశాడు” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Advertisement -