బెంగళూరు: పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్లే ఓ విద్యార్థినిపై (Bengaluru Student) అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యార్థినితో సాన్నిహిత్యం పెంచుకున్న లెక్చరర్.. ఫెండ్ర్ రూంకి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో లెక్చరర్, అతని స్నేహితుడు కూడా ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు.
ఓ విద్యార్థినిని ఫిజిక్స్ బోధించే నరేంద్ర అనే లెక్చరర్ విద్యార్థినితో(Bengaluru Student) సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అలా అనూప్ అనే ఫ్రెండ్ రూంకి తీసుకెళ్లాడు. అక్కడ విధ్యార్థినిపై ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అత్యాచారానికి సంబంధించిన వీడియో చూపించి సందీప్ అనే మరో లెక్చరర్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని విద్యార్థినిని బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో వేధింపులు తట్టుకోలేకప విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
వీరు కర్ణాటక మహిళ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు లెక్చరర్లతో పాటు అనూప్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.