లక్నో: అత్యాచారం కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన నిందితుడు బాధితురాలిని కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం భదోహి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రవి శంకర్ మిశ్రా అనే యువకుడు ఓ స్కూల్‌కు వెళ్లి బాలిక తల్లికి ఆరోగ్యం బాగలేదని తనతో విద్యార్థినిని తీసుకెళ్లాడు. స్కూల్ నుంచి కొంచెం దూరం వెళ్లిన తరువాత బాలిక మత్తు పదార్థం కలిపిన డ్రింక్ తాగించాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఆమెపై శంకర్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక తన తండ్రికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు డిసెంబర్ 28న 2024లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రవి శంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు బెయిల్‌పై విడుదలైన తరువాత కేసు వాపసు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులను పలుమార్లు బెదిరించాడు. ఈ కేసు వాపసు తీసుకోకపోవడంతో బాలికను నిందితుడు కిడ్నాప్ చేశాడు. బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో రవి
శంకర్, నిందితుడి తండ్రిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: బస్సు ఆపలేదని డ్రైవర్ పై టిడిపి నేతల దాడి