భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీ (Bhadrachalam Agency) ప్రాంతంలో ఆటో డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 17 ఏళ్ల బాలికపై సాముహిక ఆత్యాచారానికి ఒడిగట్టారు. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీగా గుర్తించారు. ఆమె బంధువుల ఇంటికి వెళ్లేందుకు చర్ల మండల కేంద్రం నుంచి వాజేడుకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటోలో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు.
దీంతో స్పృహ కోల్పోయిన బాలికపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు (Bhadrachalam Agency) బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. పోలీసులు సమాచారం అందుకొని ఘటనపై విచారణ ప్రారంభించారు. బాలిక ఒంటిపై పంటిగాట్లు, గాయాలు ఉన్నట్లు గమనించి.. అత్యాచారం కేసును నమోదు చేశారు. పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.