- Advertisement -
మనతెలంగాణ/చేగుంట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అద్యక్షులు రామకోటి రామరాజు ఆద్వర్యంలో భద్రాచల తలంబ్రాలు చేగుంటలో పంపిణి చేసారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామకోటి భక్త సమాజం ధార్మి క సేవా సంస్థ వారు భద్రాచల తలంబ్రాలు పంపిణి చేయడానికి శ్రీకారం చుట్టారు. అందులో బాగంగా చేగుంటలో కూడా భక్తులకు భద్రా చల తలంబ్రాలు పంపిణి చేసారు. ఈ సందర్బంగా భద్రాచల తలంబ్రాలు తీసుకున్న భక్తులు మాకు రాముల వారి తలంబ్రాలు రావడం సంతోషం అని తెలిపారు. ఈ సందర్బంగా వారు శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అద్యక్షులు రామకోటి రామ రాజు గారికి కృతజ్ణతలు తెలిపారు.మేము బద్రాచలం వెళ్లకున్నా ఆ బద్రాద్రి రామయ్య తలంబ్రాలు అందుకోవడం ఎన్నో జన్మల పుణ్య ఫలమే అన్నారు.
- Advertisement -