Friday, July 25, 2025

కొత్త పొలిటికల్ జానర్ మూవీ

- Advertisement -
- Advertisement -

‘మార్గన్’ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ (Bhadrakali) తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ నేలపై కూర్చుని, రెండు చేతులతో పిస్టల్ పట్టుకుని ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్ లో హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ “భద్రకాళి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.

అరుణ్ ప్రభు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆయన్ని గొప్పగా అభిమానిస్తారు. ఇది నా 25వ చిత్రం. కొత్త పొలిటికల్ జానర్ (New political genre) ఇది. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ సినిమాలన్నిటికీ ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది”అని అన్నారు. డైరెక్టర్ అరుణ్ ప్రభు మాట్లాడుతూ “భద్రకాళి నా ఫస్ట్ తెలుగు రిలీజ్. ఇది పొలిటికల్ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ రామాంజనేయులు మాట్లాడుతూ “ప్రేక్షకుడు ఆలోచించే విధంగా వినోదాత్మకంగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది.

ఇప్పటివరకు ‘బిచ్చగాడు ’ఫేం విజయ్ ఆంటోని అంటారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత భద్రకాళి విజయ్ ఆంటోని అని పిలుస్తారని నమ్మకం ఉంది. ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాను”అని పేర్కొన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ “ప్రేక్షకులకి ఈ సినిమా రాబోతుందని చెప్పడం చాలా ముఖ్యం. ఈ సినిమాని ఇంత ఉత్సాహంగా ప్రమోట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి రవీంద్ర, నిర్మాత ధనంజయన్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News