Saturday, August 2, 2025

భగవంత్ కేసరి, హనుమాన్‌ చిత్రాలకు జాతీయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విడుదలైన సినిమాలకు కేంద్రం అందించే ప్రతిష్టాత్మక 71వ జాతీయ అవార్డులను శుక్రవారం ప్రకటించారు. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు మెరిశాయి. అందులో ఉత్తమ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాను అవార్డు వరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ (Hanuman) చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డుతో పాటు ఈ చిత్రానికి(Hanuman) జాతీయ ఉత్తమ చిత్రం (ఎవిజిసి విభాగంలో) లభించింది. ఎవిజిసి అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్. జాతీయ ఉత్తమ పాటగా ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు.. పల్లెటూరు’ పాట నిలిచింది. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. ‘బేబి’ సినిమాకి గాను జాతీయ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సాయి రాజేష్‌‌కు, జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా పి.వి.ఎన్.ఎస్ రోహిత్‌లకు (ప్రేమిస్తున్నా పాటకు) అవార్డు దక్కింది. ఇక సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి గాను ఉత్తమ బాల నటి అవార్డు వచ్చింది.

71వ జాతీయ అవార్డులు అందుకున్న వారి లిస్ట్: 

ఉత్తమ నటులు: షారుక్ ఖాన్, విక్రాంత్ మాసే

ఉత్తమ చిత్రం : 12th ఫెయిల్

ఉత్తమ నటి : రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)

జాతీయ ఉత్తమ దర్శకుడు : సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీస్)

జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు ‘వాతి’ సినిమాకు జివి ప్రకాశ్ కుమార్‌కు లభించింది. జాతీయ ఉత్తమ తమిళ చిత్రం అవార్డు ‘పార్కింగ్’ చిత్రానికి.. ఉత్తమ మళయాళ చిత్రం ‘ఉల్లోజుక్కు’.. ఉత్తమ కన్నడ చిత్రం ‘కండీలు : ది రే ఆఫ్ హోప్’ అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ ఎడిటర్ అవార్డు మిధున్ మురళి చిత్రం ‘పూక్కాలమ్’ చిత్రానికి దక్కింది. జాతీయ ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డు యానిమల్ (హిందీ) చిత్రానికి లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News