Sunday, July 13, 2025

‘లెనిన్’లో మారిన హీరోయిన్

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏజెంట్’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తున్న భారీ చిత్రమే లెనిన్. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగార్జున అక్కినేని, నాగవంశీ నిర్మిస్తున్నారు. దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మాస్ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక దీనిపై లేటెస్ట్ అప్డేట్ తెలిసింది. శ్రీలీల స్థానంలో హీరోయిన్‌గా భాగ్య శ్రీ బోర్సే జూలై 16 నుంచి షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగార్జున అక్కినేని, నాగవంశీ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News