మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈ బ్యూటీ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ హరీశ్ శంకర్-రవితేజా కాంబినేషన్ వచ్చిన ఈ మూవీలో తన అందచందాలతో కుర్రాల హృదయాలను దోచుకుంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ప్లాప్ అయినా.. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే, ఈ బ్యూటీకి అందంతోపాటు ధైర్యం కూడా ఎక్కువే. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోను చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. దుబాయ్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్.. స్కై డైవింగ్ చేసి అందరికీ షాకిచ్చింది. భాగ్యశ్రీ స్కై డైవింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలావుంటే, ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతూ.. ఇతర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది. ప్రస్తుతం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు జోడీగా కింగ్డమ్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు రామ్ పోతినేనితో కలిసి మరో సినిమా చేస్తోంది. ఇవి కాకుండా మరో కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.