బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం.(Bhairavam) విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు.. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళ్‌లో దీన్ని ఒక రస్టిక్ విలేజ్ డ్రామాలా చేశారు. దీన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేయడం జరిగింది. గరుడన్ చూసిన తర్వాత కూడా ఈ సినిమా చూస్తే ఒక ఒరిజినల్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ప్రతి పాత్రకి ప్రాధాన్యత: సినిమాలో మా ముగ్గురు హీరోల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా కుదిరింది. డైరెక్టర్ విజయ్‌కి చాలా క్లారిటీ ఉంది. ఏ క్యారెక్టర్ నుంచి ఎలాంటి నటనకు కావాలో తనకి తెలుసు. ఇందులో ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో జయసుధ బామ్మ క్యారెక్టర్ చేశారు. ఆమెతో వర్క్ చేయడం ఆనందాన్నిచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్ నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఇంత కమర్షియల్ మాస్ ఫిలిం నేనెప్పుడూ చేయలేదు. ఇది నాకు ఒక కొత్త అనుభవం. -ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకి మేజర్ హైలైట్. మేము ముగ్గురం కలిసి చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ఎక్కడా రాజీ పడకుండా తీశారు నిర్మాత -రాధా మోహన్ ఎక్కడ రాజీ పడకుండా సినిమా తీశారు. -ఈ సినిమాతో శ్రీ చరణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో పాటు మంచి పాటలు కూడా ఇస్తానని నిరూపించుకున్నాడు.