ముంబై: టీం ఇండియా స్టార్ ఆటగాడు.. అభిమానులంతా ‘కింగ్’ అని పిలుచుకొనే ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli). తన కెరీర్‌లో కోహ్లీ ఎన్నో అసాధ్యమైన రికార్డులను సాధించాడు.. తిరగరాశాడు. ఎన్నో సందర్భాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అయితే గత ఏడాది టి-20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కి వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఈ మధ్యే టెస్ట్ క్రికెట్‌కి కూడా గుడ్‌బై చెప్పేశాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు పూర్తి చేసే అవకాశాన్ని కోహ్లీ చేజార్చుకున్నాడని వాళ్లు బాధపడ్డారు. ఆ తర్వాత రిటైర్‌మెంట్ అనేది ఆటగాడి వ్యక్తిగత విషయమని గ్రహించి.. ఆ విషయాన్ని వదిలేశారు. అయితే తాజాగా విరాట్‌కు భారతరత్న(Bharat ratna) ఇవ్వాలనే టాక్ నడుస్తోంది.
విరాట్‌కి కనీసం ఒక ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించినా బాగుండేది అని అంతా అనుకుంటున్నారు. అయితే టీం ఇండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా మాత్రం చాలా పెద్ద స్టేట్‌మెంట్ చేశారు. అదేంటంటే.. భారత అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను(Bharat ratna) విరాట్‌కి ఇవ్వాలని రైనా అన్నారు. అందుకు విరాట్(Virat Kohli) అన్ని విధాలుగా అర్హుడని అన్నారు. విశ్వవేదికపై విరాట్ ఎన్నో అసాధారణ ఘనతలు సాధించి.. త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడేలా చేశాడని రైనా పేర్కొన్నారు. కాబట్టి అతనికి భారతరత్న ఇవ్వాలని రైనా కోరారు.
ప్రస్తుతం స్పోర్ట్స్‌లో భారతరత్న అవార్డు వచ్చింది కేవలం సచిన్ టెండూల్కర్‌కి మాత్రమే క్రికెట్‌లో ఆయన అరుదైన ఘనతలు సాధించారు. ముఖ్యంగా ఎవర సాధించలేని విధంగా ఆయన అన్ని ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు చేశారు. అయితే ఈ రికార్డును చేధించే అవకాశం కోహ్లీకి మాత్రమే ఉంది. ఇప్పటికే కోహ్లీ 81, కానీ ఇంతలోనే టీ-20తో పాటు టెస్ట్ క్రికెట్‌కి కూడా స్వస్తి పలికాడు. దీంతో ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశే మిగిలింది. మరోవైపు కోహ్లీ స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకోవాలని బసిసిఐ తంటాలు పడుతోంది.