Saturday, August 23, 2025

ఆ విషయంలో కోహ్లీ కంటే బుమ్రా తక్కువేం కాదు: భరత్ అరుణ్

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేస్ బౌలర్లలో టాప్ ఎవరంటే వెంటనే ప్రతీ ఒక్కరు చెప్పే పేరు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). అంతలా భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసుకున్నాడు బుమ్రా. అయితే బుమ్రా సాధించిన ఈ ఘనత ఒక్క రోజు కష్టం వల్ల దక్కిన ఫలితం కాదు. ఎన్నో సంవత్సరాల కృషి, కష్టం, ఎన్నో త్యాగాల వల్ల అతను ఈ స్థాయికి చేరుకున్నాడు. అయితే బుమ్రా గురించి టీం ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ వల్ల అతని శరీరం తీవ్ర ఒత్తిడికి గురయ్యేదని.. దీంతో అతడి కోసం ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేశామని అరుణ్ తెలిపారు.

ఫిట్‌నెస్ అనగానే మనకు విరాట్ కోహ్లీ పేరు గుర్తొస్తుందని.. కానీ, బుమ్రా (Jasprit Bumrah) ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ కంటే తక్కువేం కాదని భరత్ అరుణ్ అన్నారు. ‘‘బుమ్రా అప్పట్లో మరీ వేగంగా బంతులు వేయలేకపోయాడు. దీంతో మేం ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌తో మాట్లాడాము. అతని యాక్షన్ జోలికి వెళ్లలేదు. ఎందుకంటే అది యూనిక్ యాక్షన్. దాంతో చాలా పేస్ జనరేట్ చేయొచ్చని అనిపించింది. కానీ, అదే సమయంలో ఆ యాక్షన్ వల్ల అతని శరీరంపై తీవ్రంగా ఒత్తిడి పెరుగుతున్న విషయాన్ని గుర్తించాం’’ అని భరత్ తెలిపారు.

అప్పుడు బుమ్రాతో ఫిట్‌నెస్ గురించి మాట్లాడామని.. ఫాస్ట్ బౌలర్‌గా రాణించాలంటే.. ఫిట్‌నెస్ కూడా ఎంతో ముఖ్యమని చెప్పినట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన డైట్, వ్యాయామం, చేయాల్సిన త్యాగాల గురించి వివరించామన్నారు. తనని తాను మార్చుకున్న బుమ్రా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బుమ్రాకు పిజ్జా, బర్గర్, మిల్క్‌షేక్‌ అంటే ఎంతో ఇష్టమని.. కానీ, ఫిట్‌నెస్ కోసం వాటిని వెంటనే త్యాగం చేశాడని చెప్పారు. రుచికరమైన ఆహారం కంటే, తనకు బౌలింగ్‌యే ఇష్టమని బుమ్రా చాటి చెప్పాడని కొనియాడారు.

Also Read : అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ టోర్నమెంట్‌కి గిల్ దూరం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News