Wednesday, September 10, 2025

హేమంత్ సోరెన్‌ని కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీఎం హేమంత్ తండ్రి శిబూ సోరెన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శిబూ సోరెన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా అక్కడ విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హేమంత్ సోరెన్ తో కలిసి పనిచేశారు. జెఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆ ఎన్నికల్లో విజయం సాధించడంలో భట్టి విక్రమార్క కీలక భూమిక పోషించారు. బుధవారం రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలిసిన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News