Friday, August 22, 2025

దక్షిణాదికి న్యాయం చేయండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర దక్షిణ రాష్ట్రా లు దేశ ఆదాయానికి గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ, జాతీయ ఆదాయంలో వాటి వా టాకు తగిన విధంగా నిధుల పంపిణీ జరగ డం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేసారు. తమకు జరిగే అ న్యాయాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న పరిహార సెస్సు కొనసాగించి, దా నివల్ల సమకూరే మొత్తాన్ని పూర్తిగా ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలని ప్రతిపాదించారు. జీఎస్ టి కౌన్సిల్ ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌లలో సభ్యుడైన భట్టి విక్రమార్క, గురువా రం ఢిల్లీలో మాట్లాడుతూ జీఎస్‌టి ప్రవేశపెట్టి న సమయంలో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14 శాతంగా ఉండటంతో, వార్షికంగా 14 శాతం వృద్ధి కలుగుతుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

వృద్ధి రేటులో లోటును పూరించడానికి, రాష్ట్రాలు స్థిరంగా 14శాతం వృద్ధిని సాధించేందుకు, మొదటి 5 సంవత్సరాల పాటు జీఎస్టీ పరిహారం అందించే విధానం అమలులోకి వచ్చిందని వివరించారు. అయితే, ఇప్పటి వరకు 14శాతం వృద్ధి స్థిరపడలేదని, ప్రస్తుతం రాష్ట్రాల వార్షిక వృద్ధి కేవలం 8 నుంచి 9శాతం మధ్యలోనే ఉందని తెలిపారు. జీఎస్టీ రేట్ల సరళీకరణ, పన్ను భారం తగ్గించడం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ, రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా రక్షించే చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.లేకపోతే, పరిహార సెస్సును రద్దు చేసి, సిగరెట్లు, మద్యం, విలాస వస్తువుల వంటి ‘సిన్’ లేదా లగ్జరీ ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు ప్రస్తుత స్థాయికి పెంచి, అదనంగా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలకు కేటాయించాలన్నారు.

దీనివల్ల సాధారణ పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గడంతో పాటు, పేద, మధ్యతరగతి సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగించగలదని పేర్కొన్నారు. జీఎస్‌టి ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14 శాతంగా ఉండటంతో వార్షికంగా 14 శాతం వృద్ధి కలుగుతుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు 14 శాతం వృద్ధి స్థిరపడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల వార్షిక వృద్ధి కేవలం 8 నుంచి 9 శాతం మధ్యలోనే ఉందని తెలిపారు. జీఎస్‌టి సంస్కరణలలో భాగంగా రేట్ రేషనలైజేషన్ ప్రతిపాదనకు మద్దతు తెలిపినా దానికి సరైన పరిహార యంత్రాంగం ఉండాలని భట్టి విక్రమార్క సూచించారు. లేనిపక్షంలో, పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రజల కోసం చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు దెబ్బతింటాయని హెచ్చరించారు.

నిర్మలా సీతారామన్ తో భట్టి విక్రమార్క భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News