Monday, August 18, 2025

మిగులు జలాల్లో వాటాలు తేలాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అమరావతి: మిగులు జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటాలు తేలి న తర్వాతే గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు నిర్మించినా అది చట్టబద్ధంగా, న్యాయంగా ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క స్పష్టం చేశారు. నీటి వాటాలను నిర్ధారించాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చే శారు. ఆదివారం ‘ఓట్ల చోరీ’ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. నదీ జలా ల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద ని గుర్తుచేశారు.

ప్రస్తుతం తమ రాష్ట్రం లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్త యి నీటి కేటాయింపులు జరిగిన తర్వా తే మిగులు జలాల అంశంపై ఒక స్పష్ట త వస్తుందని ఆయన వివరించారు. అయితే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును గట్టిగా స మర్థించారు. పోలవరం నుంచి వృథా గా సముద్రంలోకి పోయే గోదావరి వర ద నీటిని బనకచర్లకు తరలించి రాయలసీమను అభివృద్ధి చేయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. దిగువ రాష్ట్రంగా వరదల వల్ల తాము నష్టపోతున్నామని, అలాంటి వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగదని భరోసా ఇచ్చారు.

ఈసీ తీరు అత్యంత ప్రమాదకరం
ఓట్ చోరీ విషయంలో వస్తున్న ఆరోపణలపై స్పందించకుండా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకే అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం అత్యంత ప్రమాదకరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఓట్లను తొలగించడం అంటే పౌర హక్కులను కాలరాయడమేనని ఓట్ల చోరీకి పాల్పడుతూ బీజేపీ లబ్ధి పొందుతున్నదని విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఓటు చోరీ జరిగిన తీరును కళ్లకు కట్టేవిధంగా రాహుల్ గాందీ దేశ ప్రజలకు నిరూపించారన్నారు. బిహార్‌లో రాహుల్ గాంధీ తలపెట్టిన ఓట్ అధికార్ యాత్రకు రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. ఈ పర్యటనలో భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఓట్ల చోరీ’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనసేన ఎమ్మెల్యే కూతురు నిశ్చితార్థానికి భట్టి
విశాఖ వేదికగా జరిగిన జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు భట్టి హాజరయ్యారు. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న భట్టికి జనసేన పార్టీ నాయకులు స్వాగతం పలికారు. నిశ్చితార్థంతో పాటు అనకాపల్లి, విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో భట్టి పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రెండుసార్లు ఎంపీగా మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. జనసేన నుంచి ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News