కర్నాటక తరహాలో ఎలాంటి
ఒప్పందాలు లేవు అందరం
కలిసి టీమ్ వర్క్ చేస్తున్నాం
హెచ్‌సియులో రోహిత్ వేముల
ఆత్మహత్యకు పరోక్ష కారణమైన
రాంచందర్‌రావుకు బిజెపి ప్రమోషన్
ఇవ్వడం దారుణం రాష్ట్రంలో
డబుల్ సర్కార్ వచ్చే అవకాశమే
లేదు ఢిల్లీలో మీడియాతో
చిట్‌చాట్‌లో డిప్యూటీ సిఎం
భట్టి విక్రమార్క
మన తెలంగాణ/ హైదరాబాద్ : కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లే దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అం దరం కలిసి టీం వర్క్ చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి నేతల మాటలు మి తిమీరి పోయాయని, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ కి రావడం లేదని, జనాల్లోకి వెళ్లడం లేదన్నారు. రెం డు లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది తమ ప్రభుత్వ విధాన నిర్ణయమని, రేషన్‌కార్డు ఆధారంగానే రుణమాఫీ చేశామని చెప్పారు. సన్నబి య్యం సక్సెస్ అయ్యిందని, గతంలా పక్కదారి పట్ట డం లేదన్నారు. ఉచిత బస్సుకు మహిళల నుంచి మంచి స్పందన ఉందని, మరో 3వేల బస్సులు కొ నుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయని, మూసీ సుందరీకరణ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుందన్నారు. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుందని, దీనికి సంబంధించిన ప నులు కొనసాగుతున్నాయని భట్టి స్పష్టం చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందని, తెలంగాణ లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం లేదని పునరుద్ఘాటించారు. సిగాచీ ప్రమాదంపై విచారణ కు ఆదేశించామని చెప్పారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రభుత్వ తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల చావుకు కారణమైన వ్యక్తుల పై చర్యలు తీసుకోకుండా వారికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు అందించిన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోనీ ఏఐసిసి కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్ లో ఏఐసిసి, ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో గాని, యూనివర్సిటీ అధికారులకు విన్నవించిన విషయాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్ తో పాటు ఇంత విషం ఒక తాడును కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని సెంట్రల్ యూనివర్సిటీ వీసీకి రోహిత్ రాసిన సూసైడ్ నోట్ ఈ దేశ వాసుల మనసులను కలచివేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. అనేక కష్టనష్టాలకు ఓర్చుకుని పీహెచ్‌డి స్థాయికి వచ్చిన నవ యువకుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని, అంటే యూనివర్సిటీలో ఎలాంటి పరిస్థితులు సృష్టించబడ్డాయో అర్థమవుతుందన్నారు.
యూనివర్సిటీలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనివర్సిటీలో జరుగుతున్న సంఘటనలపై యూనివర్సిటీ విసీకి వినతి పత్రాన్ని ఇచ్చారని, ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని సెంట్రల్ యూనివర్సిటీ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ రోహిత్ వేముల తో పాటు మరో నలుగురు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులను కావాలని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారని, అలాగే బీజేపీ నాయకత్వానికి కూడా సుశీల్ కుమార్ వివరించారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. రోహిత్ వేముల తో పాటు మరో నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వీసీపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, పైనుంచి హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ నుంచి వీసీ పై ఒత్తిడి తెచ్చారు మరియు స్థానికంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు తో పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యులపై పోలీసు కేసులు నమోదు చేశారని డిప్యూటీ సీఎం వివరించారు.
నలుమూలల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక యూనివర్సిటీ అధికారులు రోహిత్ వేముల తో పాటు మరో నలుగురిని రెస్ట్ గేట్ చేయడంతో మరో మార్గం లేక రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని డిప్యూటీ సీఎం తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్య జరిగిన రోజు సభ్య సమాజం తలదించుకుందన్నారు. యావత్ భారత ప్రజలు బిజెపి నాయకత్వాన్ని తప్పు పట్టారని తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై స్పందించిన రాహుల్ ప్రత్యేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి అన్ని వివరాలు తెలుసుకొని, అన్ని విద్యార్థి సంఘాలతో పాటు రోహిత్ వేముల తల్లితో కలిసి మాట్లాడారని వివరించారు. వేముల రోహిత్ ఆత్మహత్య వంటి సంఘటనలు ఈ దేశంలో పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు దేశంలో సమాన హక్కులు ఉండాలని కోరుకునే వారికి రక్షణ కల్పిస్తామని ఆరోజు రాహుల్ గాంధీ ఆయా వర్గాల్లో ఓ నమ్మకాన్ని, భరోసాను కల్పించారని డిప్యూటీ సీఎం వివరించారు.
వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత పదవులు ఇచ్చారు : రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిపై బిజెపి నాయకత్వం చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత పదవులు ఇచ్చిందని తెలిపారు. ఆనాడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రామచంద్రరావును ఇటీవల బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారని భట్టి ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సుశీల్ కుమార్‌ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించారని తెలిపారు. దళితులు గిరిజనులను ఇబ్బంది పెట్టి వారు మరణం అంచుల దాకా వెళ్లేలా టార్గెట్ చేసే వారికి బిజెపి నాయకత్వం పదవులు ప్రోత్సాహకాలు ఇస్తుందని, బిజెపి పాలనపై మొదటినుంచి దళితులు, గిరిజనులు భయపడుతున్నట్టుగానే రోహిత్ వేముల మరణానికి కారణమైన
వారికి పదోన్నతులు ఇచ్చి ఆ పార్టీ నిజం చేసిందన్నారు. అద్భుతమైన రాజ్యాంగం ఉన్న దేశంలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడం తలదించుకునే అంశం అన్నారు. ఈ దేశంలో పుట్టిన దళితులు, గిరిజనులు ఈ దేశ వాసులేనని, భారత రాజ్యాంగం వారికి బతకడానికి అవసరమైన అన్ని హక్కులు కల్పించిందని, అందరినీ బతకనివ్వండి అంటూ డిప్యూటీ సీఎం తెలిపారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే రోహిత్ వేముల చట్టాన్ని త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక పకడ్బందీ చట్టాన్ని తీసుకువచ్చేందుకు తెలంగాణ న్యాయ శాఖ పనిచేస్తుందని వివరించారు. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని కోరుతూ కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చిందని, ఆ కేసును రీ ఓపెన్ చేసి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టమని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమాధానం ఇచ్చారు.