Wednesday, May 28, 2025

కెసిఆర్ దేవుడెట్లయితడు?

- Advertisement -
- Advertisement -

 దయ్యాలకు నాయకత్వం
వహిస్తున్న ఆయనను దేవుడని ఎట్ల
అంటారు? రాష్ట్రంలో కాంగ్రెస్
అమలు చేస్తున్న పథకాలు దేశానికే
రోల్‌మోడల్ గిరిజనుల గురించి
గత పదేళ్లలో ఒక్కసారైనా
ఆలోచనలు చేశారా? డిప్యూటీ
సిఎం మల్లు భట్టి విక్రమార్క

మన తెలంగాణ/అచ్చంపేట/బల్మూరు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో సోమవారం పలు విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించి, మరికొన్ని సబ్ స్టేషన్ల్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బల్మూర్ మం డలం. గట్టుతుమ్మెన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..ప్రజలు కోరుకు న్న ప్రజా పాలనలలో దెయ్యాలకు నాయకత్వం వహించిన కెసిఆర్ దేవుడు ఎలా అవుతారని.. ఆయనను రాష్ట్రం పొలిమేరకు తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చుట్టూ దె య్యాలు ఉన్నాయని ఆయన కూతురు కవిత చె బుతోందని..

కానీ ఎన్నికల ముందే రాష్ట్ర ప్రజ లు ఆ దెయ్యాలను వదిలించుకొని ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. మరో రెండు దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను ప్రజా ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వరుసగా సంక్షేమ పథకా లు, ఉద్యోగ, స్వయం ఉపాధి కార్యక్రమాలతో బాగుపడుతున్నారన్నారు. దీంతో తన వద్ద కు ఎ వరూ రావడం లేదని కెసిఆర్ ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల వారి పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందమంది కెసిఆర్‌లు అడ్డం వచ్చినా రాష్ట్ర ప్రగతి ఆగదని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే కులగణను విజయవంతంగా ఎలా పూర్తి చేశారని దేశంలోని మిగతా రాష్ట్రాలు అడుగుతున్నాయని అన్నారు.

రైతుల ధాన్యానికి మద్దతు ధర
అనేక సందర్భాల్లో కెసిఆర్ బాధపడుతున్నట్లు చెబుతున్నారని.. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తున్నందుకా, సన్నధాన్యం రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నందుకా అని ప్రశ్నించారు. రూ. లక్ష రైతు రుణమాఫీని పదేళ్ల కాలంలో వాయిదాల పద్ధతిన మాఫీ చేస్తే అప్పట్లో.. బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరంభంలోనే ఒకేసారి రూ.22 వేల కోట్ల రైతు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రైతులే కాదు.. భూమిలేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రతి సంవత్సరం రూ.12 వేల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. రూ. 2,000 అదనంగా పెంచి రైతు భరోసా ఇస్తున్నందుకు చూడలేక ఫామ్‌హౌస్‌లో పడుకున్న కెసిఆర్ కన్నీరు పెడుతున్నారని..

ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ప్రజలు ఆర్థికంగా నిలబడేలా ప్రతి కార్యక్రమం చేపడుతున్నామని అనారు. ఇటీవల అచ్చంపేటలో రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ ప్రకటించామని, ఈ దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటివరకు ఈ ఆలోచన చేయలేదని అన్నారు. సామాజిక తెలంగాణ కావాలని రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, అలాంటిది గిరిజనుల గురించి గత పదేళ్లల్లో కెసిఆర్ ఒక్కసారైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పాలనలో గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటనలు ఉన్నాయన్నారు.

భవిష్యత్తు తరాలకు పునాది
సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తు తరాలకు మిగులు విద్యుత్తు అందిస్తామని, ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో అంచనాలకు మించి 17,162 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేశామన్నారు. ప్రతి జిల్లాలో ఉత్పత్తి రంగాన్ని పెంచాలన్న ప్రణాళికలతో కరెంటు డిమాండ్ రాబోయే రోజుల్లో ఇంకా పెరగనుందన్నారు. మరో 50 సంవత్సరాలకు కరెంటు డిమాండ్ ప్రణాళికలను తయారు చేసుకొని తమ ప్రభుత్వం ముందుకు పోతుందని వివరించారు. 2029 =30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని అన్నారు. పాలమూరు =రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ ప్రాజెక్టు జీవో ఇచ్చిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News