హైదరాబాద్: స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితిని బిఆర్‌ఎస్ పెట్టిందని.. 42 శాతం రిజర్వేషన్ బిల్లును బిజెపి రాష్ట్రపతి దగ్గర అపిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. బిఆర్ఎస్, బిజెపిలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గాంధీ భవన్‌లో పిసిసి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం దేశానికి ఎంతో ఉందని అన్నారు. అందరం కలిసికట్టుగా పని చేసి రాహుల్‌ని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ముందు పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ లేదా ప్రభుత్వ పదవిలో ఏదో ఒకటి తప్పకుండా వస్తుందని భట్టి (Bhatti Vikramarka) హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అజేయంగా ఉండేందుకు పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టే ప్రతీ పనికి సిఎం రేవంత్‌తో పాటు కేబినెట్ అండగా ఉంటుందని అన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు, సవాళ్లను ఎదురుకొని న్యాయం చేసేందుకు ముందుకు వెళ్తున్నామని భట్టి అన్నారు.
Also Read : తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంపై మహా సిఎంతో చర్చిస్తా: రేవంత్