- Advertisement -
‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉందని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా మంచు విష్ణు అద్భుతంగా నటించారని ఆయన కొనియాడారు. కన్నప్ప కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని గొప్పగా అనిపించాయని ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుందని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశానని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశానని, ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మోహన్ బాబుకు, మంచు విష్ణుకి మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కన్నప్ప చిత్రాన్ని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డిలు వీక్షించారు.
- Advertisement -