Sunday, September 14, 2025

రెవెన్యూ సదస్సుకు వచ్చిన ప్రతి ఆర్జీ పరిశీలిస్తాం: జ్యోతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు వచ్చిన ప్రతి ఆర్జీని పరిశీలించి సమస్యను పరిష్కారమయ్యేలా చూస్తామని మోత్కూరు తహశీల్దార్ పి.జ్యోతి అన్నారు. సోమవారం మోత్కూరు మున్సిపాల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ సదస్సు ను నిర్వహించారు. ఈసంధర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులతో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి చట్టం పై అవగాహణ కల్పిస్తూ, రైతుల భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులో రైతుల సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిష్కరిస్తారని , పరిష్కారం కాని సమస్యలను మండల స్థాయిలో తహశీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ రైతుల సమస్యలను పరిష్కరించేలా భూ భారతి చట్టాన్ని రూపొందించారని తెలిపారు.

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు భూ రికార్డులను సరి చేసుకోవచ్చునని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించాలని 105 ఆర్జీలు వచ్చినట్లు తహశీల్దార్ తెలిపారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ఎం.ఉపేందర్, ఆర్‌ఐలు జె.సుమన్, డి.శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్‌లు ఇంద్ర కుమార్, ప్రభుదాస్, జూనియర్ అసిస్టెంట్‌లు హరిబాబు, నర్సింహ్మ ,మౌనిక , మమత రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News