అమరావతి: టిటిడి ఛైర్మన్ గా బిఆర్ నాయుడు ఉండడం హిందువుల దురదృష్టం అని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. బిఆర్ నాయుడు వైఎస్ఆర్ సిపి నేతలపై నిరంతరం దూషణలకు దిగుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ నాయుడు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. తన ప్రశ్నలకు బిఆర్ నాయుడు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని, టిటిడి భూములపై బిఆర్ నాయుడు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని విమర్శించారు. టిటిడి ఛైర్మన్ పదవిని అడ్డంపెట్టుకుని బిఆర్ నాయుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
టిటిడి భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు? అని అత్యంత విలువైన భూములను టూరిజం శాఖకు ఎందుకు ఇస్తున్నారని భూమన ప్రశ్నించారు. బిఆర్ నాయుడు అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటామని, బిఆర్ నాయుడు బెదిరింపులకు భయపడమని సూచించారు. టిటిడి ఛైర్మన్ గా బిఆర్ నాయుడు పదవి శాశ్వతం కాదని, తప్పుడు ప్రచారాలకు బిఆర్ నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. క్విడ్ ప్రో కింద బిఆర్ నాయుడుకు టిటిడి ఛైర్మన్ పదవి వచ్చిందని, తనపై బిఆర్ నాయుడు చేసే ఆరోపణలకు సిబిఐ విచారణకు సిద్ధం అని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు.
Read Also : గద్వాల్ లో ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి