Sunday, August 24, 2025

పదోతరగతి విద్యార్థులకు బండి సంజయ్ సైకిళ్లు పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్  (Bandisanjay) తెలిపారు. తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్ లో తలెత్తుకుని జీవిస్తాం అని అన్నారు. బండి సంజయ్ జన్మదినం పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ‘మన మోడీ కానుక ’(Modi gift) పేరుతో ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. కేంద్రప్రభుత్వం విద్య కోసం రూ. 1.28 లక్షల కోట్లు కేటాయించిందని తెలియజేశారు. త్వరలో నరేంద్రమోడీ కిట్ లు కూడా పంపిణీ చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. తన పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రుల కష్టానికి సార్థకత చేకూర్చాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News