Tuesday, September 16, 2025

13 నుంచి అమెజాన్‌లో బిగ్ ఆఫర్లు… వినియోగదారులకు పండుగ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించాయి. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా వినియోగదారులకు డిస్కౌంట్ పేరుతో అమెజాన్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. జనవరి 13 మధ్యాహ్నం నుంచి సేల్ ప్రారంభం అవుతుందని అమెజాన్ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ జనవరి 14 నుంచి వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.
మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలు, స్మార్ట్ వాచ్, ల్యాప్‌టాప్‌లు, టివిలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీగా అమెజాన్ డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎబిఐ క్రెడిట్ కార్డు, ఇఎంఐలపై మరో పది శాతం డిస్కౌంట్ కల్పించనుంది. ఆమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 12 గంటలు ముందుగానే సేల్ మొదలు కానుంది.
స్మార్ట్ పోన్లపై 40 శాతం వరకు అమెజాన్ డిస్కౌంట్లు ప్రకటించడంతో నెటిజన్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఐపోన్ 13 ధర రూ.59,999లుండగా రూ.52,999కే లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్ 23 ప్లస్ ఫోన్లను రూ.10 వేల డిస్కౌంట్‌తో సేల్ చేయనుంది. ఆఫర్ల సమయంలో కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఎక్కువ అవకాశం రావొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News