Wednesday, May 28, 2025

ప్రభాకర్‌రావుకు బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

రాజకీయ శరణార్థిగా
ఆశ్రయం కల్పించడానికి
నిరాకరించిన అమెరికా
అమెరికాలో
తలదాచుకుంటున్న
ఫోన్‌ట్యాపింగ్ కేసు
ప్రధాన నిందితుడు
ఇక ఆయనను
ఇండియాకు రప్పించడం
మరింత సులువు
ఇప్పటికే ఆయన
పాస్‌పోర్టు రద్దు చేసిన
కేంద్రం రెడ్ కార్నర్
నోటీసు జారీ చేసిన
ఇంటర్‌పోల్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ ఆయన పెట్టుకున్న అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆయనకు న్యా యపరమైన చిక్కులు మరింత పెరిగినట్లయింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఈ కేసులు బనాయించారని ప్రభాకర్‌రావు తన పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ, అమెరి కా అధికారులు ఆయన వాదనను అంగీకరించలేదు. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణలో భాగంగా జూన్ 20వ తేదీలోగా తమ ఎదుట హాజరు కావాలని తెలంగాణ పోలీసులు ప్రభాకర్‌రావుకు గతంలోనే నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఆయన పోలీసుల విచారణకు సహకరించకపోవ డంతో, ఆయన్ను పరారీలో ఉన్న నేరస్థుడిగా (ప్రకటిత నేరస్థుడు) ప్రకటించాలని కోరుతూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

దీనికి న్యాయస్థానం కూడా సానుకూలంగా స్పందించింది. జూన్ 20వ తేదీలోగా దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు ఆయన ఇంటి గోడకు నోటీసులు కూడా అంటించారు. నిర్దేశిత గడువులోగా హాజరు కాని పక్షంలో, ఆయనను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు హెచ్చరించింది. ఒకవేళ అలా ప్రకటిస్తే, ప్రభాకర్‌రావుకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లభిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావును తిరిగి భారతదేశానికి రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికాకు చెందిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. ప్రభాకర్‌రావును విచారిస్తే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. భారత్‌కు తిరిగి వచ్చి విచారణను ఎదుర్కొనేందుకు ఇష్టపడని ప్రభాకర్‌రావు, అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నించారు. అయితే, ఆయన అభ్యర్థనను అక్కడి ప్రభుత్వం తిరస్కరించడంతో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

తప్పని సరి పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్‌కు వచ్చి విచారణకు సహకరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయగా, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ ఆయనపై రెడ్ కార్నర్ నోటీసును కూడా జారీ చేసింది. ప్రభాకర్‌రావు ప్రస్తు తం ఏ ప్రాంతంలో ఉన్నారనే సమాచారాన్ని అమెరికా అధికారులు గుర్తించినట్లు సమాచారం. కాగా, రాజకీయ కక్షతో తనపై కేసులు పెట్టా రంటూ, తాను ఐపిఎస్ అధికారి అంటూ ప్రభాకర్‌రావు మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయేందుకు ఆయన వేయాల్సిన స్కెచ్‌లన్నీ వేశారు. చివరకు అవన్నీ బూమరాంగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు భయంతో ఏడాదిన్న రగా ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇండియాకు రావడం మానేశారు. ట్రంప్ సర్కార్ రాకముందే ఆయన తనను రాజకీయ శరణార్థిగా గుర్తిం చాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అసలే ట్రంప్ సర్కార్ ఎన్నారైలను ఏదో విధంగా వారి వారి దేశాలకు తరలిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభాకర్‌రావు ఆశ్రయం ఇచ్చేందుకు ససేమిరా అంది. ఈ విధంగా దారులన్నీ మూసివేతతో ప్రభాకర్‌రావు ఇండియాకు రావడం తధ్యంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News