Thursday, May 29, 2025

తెలుగు సినిమా అభివృద్ధికి కలిసికట్టుగా తోడ్పడుతాం

- Advertisement -
- Advertisement -

గత కొన్ని రోజులుగా థియేటర్ల బంద్ అంశం తెలుగు రాష్ట్రాలు, తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ (pawankalyan)మంగళవారం థియేటర్లకు ప్రజల రాకపై తీసుకోవాల్సి న చర్యల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్‌కళ్యాణ్ అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమంతా స్వాగతించి, కలిసికట్టుగా ముందు కు సాగుదాం. థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ ఫా మ్స్‌కు సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలనే అంశంపై కలిసికట్టుగా ని ర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అందజేయడం మనందరి బాధ్యత.

ఇక ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశను ఇస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలి. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన పవన్ కళ్యాణ్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మనం ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతాము. మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పతుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News