Sunday, August 17, 2025

‘బిగ్‌బాస్-9’ అగ్నిపరీక్ష.. ఆసక్తికరంగా ప్రోమో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే షోస్‌లో బిగ్‌బాస్ (Bigg Boss) ఒకటి. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. తొమ్మిదో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు కామన్‌మ్యాన్‌కు కూడా పాల్గొనే అవకాశం ఉంటుందని ప్రకటించారు. దీంతో ఈ షోలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున సామాన్యులు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో 45 మందిని ఎంపిక చేసి వాళ్లలో అగ్నిపరీక్ష అనే మరో ప్రోగ్రామ్ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే వాళ్లని ఫైనల్ చేస్తారు.

ఈ అగ్నిపరీక్షకు మాజీ బిగ్‌బాస్ (Bigg Boss) కంటెస్టెంట్‌లు అయినా.. అభిజిత్, బింధుమాధవి, నవదీప్‌లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి ఈ షోకి యాంకర్. తాజాగా ఈ అగ్ని పరీక్ష ప్రోమోని విడుదల చేశారు. కంటెస్టెంట్‌లకు జడ్జిలకు మధ్య జరిగే సంభాషణలతో ప్రోమో ఆసక్తికరంగా సాగింది. ఇక ఆగస్టు 22 నుంచి ఈ అగ్నిపరీక్ష పోటీలకు సంబంధించిన ఎపిసోడ్స్‌ ప్రసారం కానున్నాయి. ప్రముఖ ఒటిటి సంస్థ జియో హాట్‌స్టార్‌లో ఈ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News