బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా 64 లక్షల బోగస్ ఓటర్లను తొలగించడం ద్వారా ఎన్నికల జాబితా ప్రక్షాళన పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 24 నుంచి జూలై 25 వరకూ నెల్లాళ్ల పాటు ఈ రివిజన్ చేపట్టారు. అక్టోబర్, నవంబర్ లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గతంలో 7.89 కోట్ల మంది తో ఉన్న ఓటర్ల జాబితా సర్ తర్వాత ప్రస్తుతం 7.23 కోట్ల మంది ఓటర్లతో ఉంది. జూన్ 24 నుంచి నెల్లాళ్ల పాటు భారీ నెల రోజుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో దాదాపు 64 లక్షలమంది బోగస్ ఓటర్లను తొలగించారు. దీంతో ఎన్నికల జాబితా ప్రక్షాళన పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. బీహార్ లో 7.89 కోట్లు గా ఉన్న ఓటర్ల జాబితా నుంచి 64 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు తెలిపారు.
తొలగించిన వారిలో చనిపోయినవారు, శాశ్వతంగా వలస వచ్చిన వారు, బహుళ ప్రదేశాలలో నమోదు చేసిన వారు,జాడ తెలియని వారు ఉన్నారని ఈసీ పేర్కొంది. సుమారు 22 లక్షల మంది ఓటర్లు మరణించగా, 35 లక్షల మంది శాశ్వతంగా వలసపోయారు. కొందరి జాడ తెలియలేదు. కాగా 7 లక్షల మంది ఇతర ప్రదేశాలలో ఓటర్లుగా నమోదయ్యారని ఈసీ వివరించింది. జాతీయ స్థాయిలో ఓటర్ల జాబితాల పూర్తి స్థాయి ప్రక్షాళనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తప్పని సరి అని పేర్కొంది. ఆగస్టు 1న బీహార్ లో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రచురిస్తుంది. డిజిటలైజ్ చేసిన సవరించిన జాబితాలో 7.23 కోట్ల మంది పేర్లు ఉంటాయి.