- Advertisement -
పాట్నా: బిహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థితో మసాజ్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమన్ కుమార్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినితో మసాజ్ చేయించున్నాడు. తన కాళ్లను అతడు బెంచీపై ఉంచగా, విద్యార్థిని మసాజ్ చేయడం వీడియోలో ఉంది. దీనిపై ప్రశ్నించగా, “నేను పిల్లలకు ప్రేమతో చదువు చెబుతా. వారితో కాసేపు కాళ్లు, చేతులు నొక్కించుకుంటే ఏమవుతుంది?” అని ఉపాధ్యాయుడు బదులిచ్చినట్లు కనిపించింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థులకు చదువులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వాళ్లు మసాజ్ చేయించుకోవడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే టీచర్ ఇంట్లో పిల్లలతో వేరే టీచర్ మసాజ్ చేయించుకుంటే అతడు ఇదే సమాధానం చెబుతాడా? అని మండిపడుతున్నారు.
- Advertisement -