హైదరాబాద్: కోవిడ్ ప్రపంచాన్నే భయపెడుతున్న సమయంలో జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారు చేశామని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. జినోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే ఒక గుర్తింపు తీసుకొచ్చాయని అన్నారు. శామీర్ పేట్ లో జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజికల్స్ కొత్తయూనిట్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ.. దేశంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33 శాతం కేవలం జినోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని, జినోమ్ వ్యాలీ (Gnome Valley) నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయగలిగామని తెలియజేశారు. దాదాపు 100 దేశాలకు వ్యాక్సిన్లు అందించామంటే జినోమ్ వ్యాలీ పరిశ్రమలదే ఆ గొప్పతనం అని ప్రశంసించారు. ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదని చెప్పారు. 1994 నుంచే పదేళ్లు టిడిపి, పదేళ్లు కాంగ్రెస్, పదేళ్లు బిఆర్ఎస్ ఉన్నా, పరిశ్రమల విధానాల్లో ఏమార్పు చేయలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
జినోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే ఒక గుర్తింపు : రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -