Wednesday, July 9, 2025

విమానాన్ని ఢీకొన్న పక్షి.. టేకాఫ్ అయిన కాసేపటికే..

- Advertisement -
- Advertisement -

పట్నా: ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఎ320ని (Indigo Flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. పక్షి ఢీకొట్టడంతో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని పట్నా ఎయిర్‌పోర్టుకు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానాన్ని ఢీకొన్న పక్షి చనిపోయి రన్‌వేపై పడిపోయింది.

అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఏమీ కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానానికి మరమత్తులు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఇదే సంస్థకు చెందిన ఓ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. పట్నా నుంచి కోల్‌కతాకు 175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానానికి (Indigo Flight) ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News