Monday, July 7, 2025

వంద సీట్లు కొడతాం…బిఆర్‌ఎస్‌ను బొంద పెడతాం: బీర్ల ఐలయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు కొడతాం…బిఆర్‌ఎస్‌ను బొంద పెడతాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు పక్కాగా గెలవబోతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారని ఐలయ్య ఆదివారం విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. ఇకమీదట తమ నినాదం ‘వంద కొడతాం…బిఆర్‌ఎస్‌ను బొంద పెడతాం’ అని ఆయన తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గద్దె దించారు, లోక్‌సభ ఎన్నికల్లో జీరో చేశారు, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులను లేకుండా చేస్తారని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు బిఆర్‌ఎస్‌ను పడగొట్టారని అన్నారు. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించడానికి బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News