Wednesday, April 30, 2025

జెడి (యు), బిజెపిలది ‘అవకాశవాద’ పొత్తు

- Advertisement -
- Advertisement -

‘అధికారం’ కోసం నితీశ్ పక్షాలు మారుస్తుంటారు
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపణ

బక్సార్ (బీహార్) : బీహార్‌లో అధికార జెడి (యు), బిజెపి మధ్య పొత్తు ‘అవకాశవాదంతో కూడుకున్నది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘అధికారం’ కోసమే పక్షాలు మారుస్తుంటారని కూడా ఖర్గే ఆరోపించారు. బక్సార్‌లో దాల్సాగర్ స్టేడియంలో పార్టీ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఖర్గే ప్రసంగిస్తూ, ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ ప్రభుత్వానికి అధికార చ్యుతి కలిగించవలసిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నితీశ్ కుమార్, బిజెపి మధ్య పొత్తు అవకాశవాదంతో కూడుకున్నది. రాష్ట్ర ప్రజలకు అది మంచిది కాదు. నితీశ్ కుమార్ కేవలం పదవి కోసం పక్షాలు మారుస్తుంటారు.

మహాత్మా గాంధీని హత్య చేసిన సిద్ధాంతంతో జెడి (యు) చీఫ్ చేతులు కలిపారు’ అని ఖర్గే ఆరోపించారు. బీహార్ కోసం రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వాగ్దానం సంగతి ఏమిటని కూడా ఆయన అడిగారు. ప్రధాని ‘అబద్ధాల కర్మాగారాన్ని’ నడుపుతున్నారని ఖర్గే ఆరోపించారు. ‘ప్రధాని మోడీ 2015 ఆగస్టు 15న బీహార్‌కు వాగ్దానం చేసిన రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజి గతి ఏమిటని బీహార్ ప్రజలు ఆయనను ప్రశ్నించాలి. ప్రధాని ‘అబద్ధాల ఫ్యాక్టరీని’ నడుపుతున్నారని ఖర్గే ఆరోపించారు. బీహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చారు.

తదుపరి రాష్ట్ర ఎన్నికల్లో ‘మహాఘట్‌బంధన్’ కోసం ప్రజలు వోటు వేయాలని ఖర్గే కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీపైన, రాహుల్ గాంధీపైన ఇడి ఇటీవల దాఖలు చేసిన చార్జి షీట్ గురించి ఖర్గే ప్రస్తావిస్తూ, ‘కాంగ్రెస్‌నే లక్షం చేసుకునేందుకే ఇది చేశారు. మా నేతలు భయపడజాలరు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారు’ అని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ‘సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమానికి అనుకూలం కాదు’ అని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ‘వారు సమాజంలోని నిరుపేదలు, మహిళలు, బలహీన వర్గాలకు వ్యతిరేకులు&వారు సమాజం శ్రేయస్సు కోసం ఆలోచించలేరు. కులం, మతం ఆధారంగా సమాజాన్ని చీల్చడంపైనే వాటికి విశ్వాసం ఉంది’ అని ఆయన విమర్శించచారు. ‘పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ (సవరణ) మతాల మధ్య చీలిక సృష్టికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పన్నిన కుట్ర’ అని కూడా ఖర్గే ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News