- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః వివాదస్పద అంశాలపై బిజెపి నాయకులు ఎవరూ మాట్లాడవద్దని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు హెచ్చరించారు. కొంత మంది నేతలు పార్టీ లైన్‌కు విరుద్ధంగా మీడియాతో మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఎవరూ గీత దాటి మాట్లాడవద్దని ఆదేశించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ నిర్దేశించిన నాయకులే మీడియాతో మాట్లాడుతారని ఆయన తెలిపారు. వివాదస్పద అంశాలపై పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడరాదని ఆయన సూచించారు.
- Advertisement -