హైదరాబాద్: తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోందని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఎంఎల్ సి కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని స్పష్టం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి ఎప్పటికీ బిజెపి వ్యతిరేకం కాదని, మతవిద్వేషాలను బిజెపి రెచ్చగొడుతోందని విమర్శించారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రేమ లేకపోతే దుష్ప్రచారం ఆపాలని బిజెపి నేతలకు చురకలంటించారు. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాయాలని సూచించారు. ఇతర రాష్ట్రాలో విమోచన దినోత్సవాలు బిజెపి వాళ్లు చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రెచ్చగొట్టడానికి బిజెపి వాళ్లు విమోచన దినోత్సవం జరుపుతున్నారని దుయ్యబట్టారు.
Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?