Wednesday, September 17, 2025

అక్కడ 144 సెక్షన్ ఎందుకు పెట్టారు?: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోలేదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. పొరపాట్ల వల్లే మేడిగడ్డ బ్యారేజీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ వేల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. లక్ష కోట్లు ఖర్చు చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రాజెక్టుల దగ్గర 144 సెక్షన్ ఎందుకు పెట్టారు? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News