Wednesday, September 3, 2025

కాంగ్రెస్ నాయకుడికి రెండు ఓట్లా?.. రాహుల్ గాంధీపై బిజెపి ఫైర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయని, రాహుల్ గాంధీ తన పార్టీ దొంగ ఓట్లను ‘కాపాడుకోడానికి, దాచేందుకు’ బీహార్‌లో ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారని బిజెపి మంగళవారం ఆరోపించింది. బిజెపి ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ ఈ విషయం తెలిపారు.‘రాహుల్ గాంధీ, ఆయన సహచరులు, దొంగలు ఉత్తుత్తిగానే గోల చేస్తున్నారు’ అన్నారు. ఖేరాకు రెండు ఓట్లుండడంపై దర్యాప్తు జరపాలని, రెండు ఓట్లు కలిగి ఉండడం అన్నది ప్రాజా ప్రాతినిధ్య చట్టం కింద నేరమని భండారీ అనడమే కాకుండా, ఖేరా మీద చర్యలు తీసుకుని, ఆయనను కాంగ్రెస్ నుంచి తొలగించే దమ్ముందా అని రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. కాగా బిజెపి నాయకుడు అమిత్ మాలవీయ కూడా తన ఎక్స్ పోస్ట్‌లో కాంగ్రెస్‌ను విమర్శఙంచారు. బిజెపి ఆరోపణపై కాంగ్రెస్, ఖేరా లేదా రాహుల్ గాంధీ ఇంతవరకు స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News