Thursday, July 3, 2025

కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిజెపి: సింగరేణి జెఎసి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యైటింక్లయిన్‌కాలనీ: దేశంలోని కార్మికుల కాలరాస్తున్న బిజెపికి జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను దిగ్విజయం చేసి కనువిప్పు కలిగించాలని సింగరేణి జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. ఆర్‌జి3 ఏరియా ఓసిపి1 ప్రాజెక్టులో మంగళవారం ఐఎన్‌టియుసి కేంద్ర కమిటి కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఎఐటియుసి వైవి రావ్, టిబిజికెఎస్ నాగెల్లి సాంబయ్య, సిఐటియు కొంరయ్య హజరై ప్రసంగించారు.

నిరంకుశ కార్మిక వ్యతిరేక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల అమలు, రిటైర్డు కార్మికులకు కనీస పెన్షన్ పెరుగుదల, బొగ్గు గనుల వేలం పాటల నిలుపుదల లాంటి అంశాలపై నిర్వహిస్తున్న సమ్మెలో ప్రతి కార్మికుడు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐఎన్‌టియుసి జి వెంకటస్వామి, సయ్యద్ సలీం, రాంచందర్, రవికుమార్, చంద్రశేఖర్, ఎఐటియుసి ఎం ఆర్ సి రెడ్డి, డిటి రావ్, శేఖర్, టిబిజికెఎస్ పింగిలి సంపత్‌రెడ్డి, అల్లం తిరుపతి, శ్రీకాంత్‌రావ్, సిఐటియు రాజేశ్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News