Sunday, July 6, 2025

100 సీట్లు పక్కా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేకప్రతినిధి : ‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లను కై వసంచేసుకుని అధికారంలోకి పక్కాగా వ స్తాం..’అని బిజెపి రాష్ట్ర నూతన రథసారధి రాంచందర్ రావు ధీమాగా అన్నారు. అదేవిధంగా పదిహేను లోక్‌సభ స్థానాలనూ సునాయసంగా కైవసం చేసుకుంటామని ఆయన తె లిపారు. ఇటీవల బిజెపి అధ్యక్షునిగా నియమితులైన రాంచందర్ రావు శనివారం పదవీ బా ధ్యతలు స్వీకరించారు. అనంతరం రాంచందర్‌రావు విలేఖరుల సమావేశంలో మాట్లాడు తూ కాంగ్రెస్, బిజెపిలపై ధర్మయుద్ధం ఆరంభమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లతో ప క్కాగా అధికారంలోకి రాబోతున్నామని ఆయ న ధీమాగా చెప్పారు. అయితే కాంగ్రెస్ వంద సీట్లు గెలవబోతున్నదని ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ బిజెపి వంద సీట్లతో అధికారంలోకి రా బోతున్నదని ఖర్గే చెప్పబోయి పొరపాటును నో రు జారి కాంగ్రెస్ అని అన్నారని రాంచందర్ రావు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీపై వి మర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ను పారదోలేందుకే ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని లోగడ బిజెపి జాతీయ నాయకత్వం పిలుపుఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ముక్త్ తెలంగాణ అని పిలుపు ఇస్తున్నానని అన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ను రాష్ట్రం నుంచి సాగనంపేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని, ఆల్ ఇండియా ఛీటింగ్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన దుయ్యబట్టారు.

స్థానిక పోరులో చుక్కలు చూపిస్తాం..
తొలుత తమ లక్షం స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం అని ఆయన తెలిపారు. స్థానిక పోరులో కాంగ్రెస్-, బిఆర్‌ఎస్‌లకు చుక్కలు చూపిస్తామని ఆయన ధీమాగా చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ ఏమైందని ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ప్రతి ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రైతులను మోసగించినందున వారి ఉసురు సర్కారుకు తగులుతుందన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, సర్కారు బికారీ అయ్యిందని అధికారంలో ఉన్న వారు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సంపన్న తెలంగాణను పేద తెలంగాణగా మార్చారని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు.

యూరియా మింగారా?
కేంద్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్నా, కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతున్నదని, అదనంగా నిధులేమి తేవడం లేదని కాంగ్రెస్ విమర్శించడాన్ని రామచందర్ రావు ప్రస్తావిస్తూ, పన్నెండు లక్షల కోట్ల రూపాయల నిధులు తెలంగాణకు తెచ్చినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పదెపదే చెబుతున్నారని అన్నారు. రైతుల కోసం కేంద్రం రెండు లక్షల టన్నుల యూరియా ఇస్తే ఏమి చేశారు?, మింగారా, తిన్నారా? అంటూ ఆయన కోపంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉంటే ఇటీవల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించారని, కాంగ్రెస్ ఘోరంగా ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో రెండు స్థానాల్లోనే కాంగ్రెస్ గెలుపొందిందని అన్నారు.
కవిత చెప్పాల్సిన అవసరం లేదు
బిసి రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్ళడమే బిజెపి నూతన రథసారధి బాధ్యతగా తీసుకోవాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పడాన్ని ఓ విలేఖరి ప్రశ్నించగా, ఏయే బాధ్యతలో చేపట్టాలో కవిత తనకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బిసి రిజర్వేషన్లు ఎందుకు గుర్తు రాలేదని ఆయన ప్రశ్నించారు.

మతపరమైన రిజర్వేషన్లు వద్దు..
మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని రామచందర్ రావు మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఇతర ఓబిసిల కోసమే ఓబిసి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది కదా అని ఆయన వివరించారు.
బాధ్యతల స్వీకరణ..
ఇదిలాఉండగా రామచందర్ రావు శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం వరకూ బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రామచందర్ రావుకు బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు ఆయన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద అమర వీరులకు నివాళి అర్పించారు. రామచందర్ రావు పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు.

పోస్టర్లు అంటించా..
సైకిల్‌పై తిరిగాను
ఇదిలాఉండగా రామచందర్ రావు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ తాను బిజెపిలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని అధిష్టించడం సంతోషంగా ఉందన్నారు. లోగడ తనను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని ఆయన తెలిపారు. సామాన్య కార్యకర్తగా ఉన్న రోజుల్లో సైకిల్‌పై తిరిగే వాళ్ళమని, పార్టీ పోస్టర్లు గోడలకు అంటించేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రం స్థాయి కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన తనకు పార్టీ జాతీయ నాయకత్వం అధ్యక్షునిగా అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News