Sunday, September 14, 2025

ఇంకా దొరకని విమానం బ్లాక్ బాక్స్‌.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పుడు బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది?.. ఘటన సమయంలో విమానంలో ఏం జరిగిందో తెలియాలంటే బ్లాక్ బాక్స్ చాలా అవసరం. కానీ ఇప్పటివరకు అది దొరకలేదు. బ్లాక్ బాక్స్ దొరికిందని వస్తున్న వదంతులను ఎయిర్ ఇండియా కొట్టిపారేసింది. ఏం జరిగిందనే దాని గురించి కీలకమైన సమాచారాన్ని అందించే విమానం బ్లాక్ బాక్స్‌ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని.. దానికోసం ఘటనాస్థలంలో సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఇప్పటికే దర్యాప్తు బృందం సంఘటనాస్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరిస్తోంది. శుక్రవారం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన ప్రధాని అనంతంరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించారు. తర్వాత ఈ ఘటనపై అధికారులతో సమావేశమై సమీక్షించారు. కాగా, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 297కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News