Tuesday, May 20, 2025

బలూచిస్తాన్ పేలిన బాంబు : నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బలూచిస్తాన్ ప్రాంతం మార్కెట్ సమీపంలో ఓ బాంబు పేలడంతో నలుగురు మరణించారు, 20 మంది ఇతరులకు గాయాలయ్యాయని మీడియా సోమవారం పేర్కొంది. ఈ పేలుడు బలూచిస్తాన్‌లోని కిల్లా అబ్దుల్లా జిల్లాకు చెందిన జబ్బార్ మార్కెట్ సమీపంలో సంభవించింది. అనేక దుకాణాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు వల్ల అనేక సంస్థలు అగ్నికి ఆహుతయ్యాయని ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్’ వార్తాపత్రిక పేర్కొంది.

పేలుడులో నలుగురు చనిపోయారని, 20 మంది ఇతరులకు గాయాలయ్యాయని కిల్లా అబ్దుల్లా డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ తెలిపారు. గాయపడిన వారిలో గిరిజన పెద్ద హాజీ ఫైజుల్లా ఖాన్ ఘాబిజాయ్ సెక్యూరిటీ గార్డ్, అనేక మంది ఇతరులు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా బలూచిస్తాన్ అశాంతిని ఎదుర్కొంటున్నది. ఫెడరల్ ప్రభుత్వం అక్కడున్న ఖనిజ సంపదను కొల్లగొడుతోందని బలూచ్ గ్రూప్‌లకు చెందిన గిరిజన తెగవారు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News