మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 157’ (Mega 157) షూటింగ్ కేరళలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. టీం ప్రస్తుతం ఒక పాటను చిత్రీకరిస్తోంది. చిరంజీవి, నయనతారలపై ఓ కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సెసిరోలియో అద్భుతమైన సాంగ్‌ని కంపోజ్ చేశారు.
పెళ్లి సందడి నేపథ్యంలో జరగుతున్న ఈ పాట పూర్తిగా సంతోషకరమైన వాతావరణంలో సాగుతుంది. అలాగే కొన్నికీలకమైన సీన్లను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ జూలై 23కి పూర్తవుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ (Chiranjeevi promo vintage stylish) లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా షూటింగ్ స్పీడుగా, ప్లాన్‌డ్‌గా జరుగుతోంది. మెగా 157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్రలో నటిస్తున్నారు.