Sunday, June 15, 2025

రక్త దానం ప్రాణ దానమే: మాచన

- Advertisement -
- Advertisement -

రక్త దాతలు సాక్షాత్ దేవుళ్లే అని, రక్త దానం ప్రాణ దానమేనని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ అన్నారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా..శనివారం రఘునందన్ హైదరాబాద్ లో..రెడ్ క్రాస్ వారి రక్త దాన శిబిరంలో రక్త దానం చేశారు. ఈ సందర్భంగా.. రఘునందన్ మాట్లాడుతూ.. దేవుళ్ళు ఎక్కడో ఉండరు, రక్త దాతల రూపంలో మన ఎదుటే ఉంటారని అభిప్రాయపడ్డారు. యువత రక్త దానం చేయడం పట్ల ఆసక్తి కలిగి ఉంటే మంచిదని, సమాజంలో స్ఫూర్తి దాయకంగా నిలుస్తారని అన్నారు.

అన్ని దానాల్లో కన్నా రక్త దానం మిన్న అన్నారు. ఎవరైనా ఏదైనా దానం చేయొచ్చు కానీ రక్త దానం చేస్తే ప్రాణాలు నిలబెట్టామన్న ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తీ ఏటా 3 పర్యాయాలు రక్త దానం చేసే అవకాశం ఉందని అన్నారు. రక్త దానం పట్ల జన బాహుల్యంలో సరైన అవగాహన, చైతన్యం లేకే రక్త దానం చేసేందుకు కొందరు ఆసక్తి చూపక పోవడం తో పాటు, అపోహ, భయ ఆందోళన వల్ల కూడా రక్త దానం చేసేందుకు దూరంగా ఉంటున్నారని రఘునందన్ అన్నారు. సేవా భావంలో ఉత్కృష్టమైనని రక్త దానం అని సూచించారు. తను ఇప్పటివరకు 96 మార్లు రక్త దానం చేసినట్టు మాచన రఘునందన్ స్పష్టం చేశారు. రక్త దాతలు ప్రాణ దాతలని.. ఆపద నుంచి గట్టెక్కించే దేవుళ్ళుగా రక్త దాతలు పరిగణింపబడతారని రఘునందన్ అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News