- Advertisement -
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) చిక్కుల్లో పడ్డారు. అక్రమ నిర్మాణాల కేసులో ఆయనకు బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మలాడ్‌లోని ఎరాంగిల్ విలేజ్‌లో మిథున్ చక్రవర్తి గ్రౌండ్ ఫోర్‌లో నిర్మాణాలు చేపట్టారని ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో సెక్షన్ 351(1ఎ)కింద నోటీసులు పంపించింది. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది. సరైన వివరణ రానీ పక్షంలో నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించింది. అయితే దీనిపై మిథున్ చక్రవర్తి స్పందించారు. తను అక్రమ నిర్మాణం చేపట్టాననడం అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. బిఎంసికి దీనిపై సరైన వివరణ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -