Sunday, August 24, 2025

బోడుప్పల్‌లో మరో దారుణం… గర్భవతైన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/బోడుప్పల్: మీర్‌పేట గృహిణి హత్యకేసు తరహాలోనే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన స్వాతి(21) అనే మహిళను భర్త మహేందర్‌రెడ్డి చంపి ముక్కలుగా నరి కాడు. ఈ ఘోర దుర్ఘటన మృతురాలి కుటుంబీకులు, బంధువులతో పాటు స్థానికులను కలవరానికి గురి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపింది. పోలీసులు సైతం దిగ్భ్రాంతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్‌రెడ్డితో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకున్న స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్‌రెడ్డిని ఒప్పించి వివాహం చేశారు.

అయితే ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య స్వాతి గర్భవతి అయినప్పటి నుంచే మహేందర్ రెడ్డికి అనుమానం మొదలైంది. మొదటి గర్భాన్ని తీయించాడు. రెండోసారి కూడా స్వాతి గర్భవతి కావడంతో ఆ గర్భం తన వల్ల రాలేదని అనుమానించి తరచూ గొడవలు పెట్టేవాడు. మహేందర్‌రెడ్డి ర్యాపిడో నడుపుతుండగా, స్వాతి పంజాగుట్టలోని ఓ కాల్ సెంటర్‌లో టెలికాలర్‌గా పని చేస్తుండగా, ఇంట్లో ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతుందనే కారణంతో కూడా అనుమానం పెంచుకున్నాడు. అయితే దంపతుల నడుమ తరుచూ గొడవులు జరుగుతుండేవి. ఈ నెల22న కూడా గొడవ జరిగింది. స్వాతి గర్భవతి, మెడికల్ చెకప్‌కి తీసుకెళ్లమని అడిగింది.

ఈ విషయంలోనే మొదలై గొడవ పెద్దగా అయ్యింది. ఈ కారణంగానే స్వాతిని హతమార్చాలని మహేందర్ రెడ్డి ముందే ప్లాన్ చేశాడు. 25 రోజుల క్రితం బోడుప్పల్‌లోని బాలాజీహిల్స్‌లో వీరు అద్దెకు దిగారు. మహేందర్‌రెడ్డి ర్యాపిడో నడుపు తుండగా, స్వాతి కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం మహేందర్ స్వాతిని ముక్కలుగా నరికి తల, కాళ్లు, చేతులు వేరు చేసి మూసీలో పడే శాడు. మిగిలిన మొండాన్ని కవర్‌లో ప్యాక్ చేసి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు. అనంతరం స్వాతి ఆత్మ హత్య చేసుకుందని తన సోదరికి సమాచారమిచ్చాడు. ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు బోడుప్పల్‌లోని బంధువులకు ఈ విషయం చెప్పిం ది. వారు మహేందర్‌రెడ్డి ఇంటికెళ్లి చూడగా కవర్‌లో ముక్కలుగా ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. కాగా స్వాతి గర్భం దాల్చడంతో ఆ విషయం లోనే వివాదం తలెత్తి స్వాతిని అత్యంత కిరాతకంగా మహేందర్ హత్య చేశాడు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేం దుకు శతవిధాలా ప్రయత్నిం చాడని కానీ చివరకు పోలీసులకు మహేందర్‌రెడ్డి చిక్కాడు.

ప్రణాళికతోనే స్వాతి హత్య… డిసిపి పద్మజ
‘భార్య స్వాతి హత్యకు మహేందర్ ప్రణాళికను రచించాడు. బోడుప్పల్‌లో ఓ దుకాణంలో హాక్సా బ్లేడ్ కొనుగోలు చేశాడు. భార్య గొంతు నులిమి చంపి ముక్కలు ముక్కలుగా చేశాడు. తల ఒకసారి కాళ్లు ఒకసారి చేతులు మరోసారి ముక్కలు చేశాడు. మూడు సార్లు కవర్లలో చుట్టి శరీర భాగా లను మూసీ నదిలో పడేశాడు. 3 సార్లు మూసీకి వెళ్లి శరీరభాగాలు పడేశాడు. మూడు సార్లు వెళ్ళి శరీర భాగాలను పడేసిన తర్వాత, తన చెల్లికి ఫోన్ చేసి నా భార్య మిస్త్స్రంది అని చెప్పాడు. దీంతో బావ గోవర్ధన్ రెడ్డి, మహేందర్ దగ్గరకు వచ్చాడు. అయితే.. మహేందర్ రెడ్డి ప్రణాళికబద్ధం గా హత్య చేసినట్లు తేలిందని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న’ట్లు మల్కాజ్‌గిరి డిసిపి పద్మజా వెల్లడించారు.

స్వాతి, మహేందర్ మధ్య వైరంపై పోలీసుల ఆరా…
ప్రేమవివాహం చేసుకుని బోడుప్పల్‌లో ఉంటున్న స్వాతి, మహేందర్ మధ్య వైరానికి గల కారణాలపై లోతుగా పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్నం సంబంధించి వేధిస్తున్నాడా? లేక మరో విషయంలో గొడవలు జరుగుతున్నాయా; అన్న కోణంలోనూ పోలీసులు విచారణ కొనసా గుతోంది. అయితే విచారణలో స్వాతి కాళ్లు, చేతులు, తల వేరు చేసి ప్రతాప్ సింగారంలోని మూసీలో వేసినట్లు నిందితుడు చెప్పడంతో వాటి కోసం మహేందర్‌రెడ్డితో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాతి చనిపోయినట్లు సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. విషాదకర ఘటనతో మహేందర్‌రెడ్డి, స్వాతి స్వగ్రామంలో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. హత్య విషయం తెలిసిన మహేందర్‌రెడ్డి తల్లిదండ్రులు స్వాతి బంధువులు దాడి చేస్తారనే భయంతో ఇంటికి తాళం వేసి ఊరి నుంచి ఉడాయించారు.

మహేందర్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
ఇక.. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన స్వాతి భర్త మహేందర్ రెడ్డిని పోలీసులు రిమాండ్‌lకు తరలించారు.
మూసీలో వరద ఉద్ధృతి.. స్వాతి శరీర భాగాల వెతుకులాట నిలిపివేత
మరోవైపు స్వాతి శరీర భాగాల కోసం మూసీలో వెతుకులాట సాగించారు. మూసీలో సుమారు 10 కిలోమీటర్ల వరకు వెతికారు. అప్పటికీ ఆమె శరీర భాగాలు దొరకకపోవడంతో గాలింపు నిలిపివేశారు. మూసీలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు ఆపేశారు.
మహేందర్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలి: మృతురాలి కుటుంబసభ్యులు
స్వాతిని దారుణంగా నరికి హత్య చేసిన మహేందర్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News